కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల మండలంలో ఆదివారం యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సైకిల్ తొక్కుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ ఉన్నత అధికారి డీజీపీ , కర్నూల్ రేంజ్ డిఐజి మరియు కడప జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండటం కోసం సైకిల్ యాత్ర చేపట్టమని ఇచ్చిన ఆదేశాల మేరకు జమ్మలమడుగు డీయస్పీ వెంకటేశ్వర రావు ఆధ్యర్యంలో యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ సీఐ సమక్షంలో యర్రగుంట్ల ఎస్ఐ మరియు కలమల్ల ఎస్ఐ తమ సిబ్బందితో యర్రగుంట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో ఆరోగ్యం కాపాడుకోవడం కోసం సైకిల్ తొక్కడం కార్యక్రమం నిర్వహించారు.