శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తకొజ్జిరియా జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గురువారం కవిటి పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఒడిస్సా కు చెందిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై పలాస 20 ఒక కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ద్విచక్ర వాహనం తో పాటు గంజాయిని స్వాధీనం చేసుకుని యువకుడు రిమాండ్ కి తరలించినట్లు సీఐ గురువారం కవిటి పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో వెల్లడించారు