సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క. ములుగులోని 163 జాతీయ రహదారి నుంచి మదనపల్లి క్రాస్ రోడ్డు వరకు రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులను మంత్రి సీతక్క నేడు మంగళవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించారు. పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయం సంస్థ ఛైర్మన్ బానోత్ రవిచందర్ పాల్గొన్నారు.