నిర్మ జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని బాసర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు కోరారు. హైదరాబాద్లోని ఆమె నివాసంలో మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రానున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ హాజరుకావాలని ఆలయ వేద పండితులు మంత్రిని కోరారు