కలికిరి మండలంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వాతావరణం లో వచ్చిన మార్పుల కారణంగా అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున మేడికుర్తి పి. హెచ్. సి. పరిధిలోని కొటాల గ్రామం లో నిర్వహిస్తున్న 104 సేవలలో భాగంగా హాజరైన ప్రజలకు శుక్రవారం డాక్టర్ కావ్య గంధ ఆధ్వర్యంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ కాలాను గుణంగా వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా,చీకెన్ గుణ్య అతిసారా,టైఫాయిడ్, కళ్ళ కలక వంటి రోగాలపై అవగాహన కల్పించి కర పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు