Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
ఉదయగిరి మండలం, సర్వరాబాదు హైవేపై ప్రమాదం జరిగింది. సీతారామపురం వైపు నుంచి బైక్పై మాసాయిపేటకు చెందిన బాబు ఉదయగిరికి వెళ్తున్నారు. ఈ క్రమంలో గేదెను ఢీకొట్టడంతో బాబుతో పాటు గేదె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.