నిర్మల్ జిల్లా కేంద్రంలోని కస్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో అకాడమిక్ క్యాలెండర్ అమలు పరచాలని విద్యార్థులకు వ్యాయామ పిరియడ్ కేటాయించాలని సూచించారు. అన్ని పాఠశాలలో క్రీడా పరికరాలు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇప్పటినుంచి పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ప్రత్యేక ప్రణాళిక ఏర్పరచుకొని సబ్జెక్టుల వారిగా చదువుకోవాలన్నారు. ఇందులో ఎంఈఓ నరసయ్య, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం మధుసూదన్, ఉపాధ్యాయుల