జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, అంగన్వాడి భవనాలు, పాఠశాలల మరుగుదొడ్లు, ఉపాధి హామీ నిధుల ద్వారా చేపట్టిన పనులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు స్వయంగా పనులను పర్యవేక్షించి, ప్రజలకు ఉపయోగపడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అభివృద్ధి పనులన్నింటిని సమయానికి పూర్తి చేయడంలో ఎటువంటి అలసత్వ