దివ్యాంగులకు కూటమి అండగా ఉంటుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాజమండ్రిలోని దానవైపేట హైస్కూల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రతినెల ఒకటవ తారీఖున పెన్షన్ అందజేస్తున్నట్లు తెలియజేశారు.