భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు పరిశీలించారు. భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జి.ఎం.ఆర్ అధికారులు క్షేత్ర స్థాయి లో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా విమానాశ్రయాన్ని అంతటినీ కలియతిరిగి పనులన్నీ సక్రమంగా సాగుతున్నాయి అన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు. జూన్ 2026 నాటికల్లా విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతాము అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గడిచిన 14 నెలలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు.