ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం లో శనివారం సివిల్ రైట్స్ డే పురస్కరించుకొని అంటరానితనం, ప్రాథమిక హక్కుల పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు పాల్గొని ప్రజలకు వివిధ అంశాలపై మరియు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంటరానితనంగా చూసే వారికి కలిగే శిక్షలు అలానే అంటరానితనాన్ని పోగొట్టుకునేందుకు బాగా చదువుకోవాల్సిన ఆవశ్యకత తెలిపారు. అలానే సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నాగరాజు వివరించి చెప్పారు.