గుత్తి మండలం బాట సుంకులమ్మ దేవాలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.బైకు అదుపు తప్పి రోడ్డు డివైడర్ ఢీ కొనింది.ప్రమాదంలో బైక్ ను డ్రైవ్ చేస్తున్న శేషు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.గుత్తికి చెందిన శేషు జలదుర్గం కు బైక్లో బయలుదేరాడు.మార్గమధ్యలో బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది.ప్రమాదంలో గాయపడిన శేషు ను స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు.పోలీసులు దర్యాప్తు చేపట్టారు.