కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని సింహాద్రిపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో గురువారం మండల కేంద్రమైన సింహాద్రిపురం లో వినాయక మండపాల వద్దకు వెళ్లి ఉత్సవ కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు మట్టి విగ్రహాలను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి అనుకూలమని చెప్పారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణానికి హానికరమని వీటిని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కరగకుండా నీటిలో ఉన్న చేపలు వివిధ జీవులు మృతి చెందే ప్రమాదం ఉందని చెప్పారు.