సూర్యాపేట జిల్లాలో నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి శుక్రవారం అన్నారు. సూర్యాపేట మండలం బాలేముల గ్రామంలో రైతు బీరెల్లి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో నానో యూరియా నానో డిఏపి మందులను డ్రోన్ ద్వారా పిచికారి చేసి ఆయన మాట్లాడారు .నానో యూరియా వాడకం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.