ఆలూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాలను విడుదల చేస్తూ ఎంపీడీవో గంగాధర్ సోమవారం మధ్యాహ్నం 3:10 సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై అన్ని పార్టీల రాజకీయ ప్రతినిధులు నాయకుల నుండి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.