డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతులకు అండగా నిలవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో పడుగుపాడు, ముదివర్తి సొసైటీ సహకార సంఘాల చైర్మన్లు త్రిసభ్య కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.