వార్షిక తనిఖీల్లో భాగంగా హైదరాబాద్ డిజిపి కార్యాలయం నుండి వచ్చిన డిఎస్పి శ్రీనివాసరావు గురువారం మూడు గంటల సమయంలో నారాయణపేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధాలను తనిఖీ చేశారు. అంతకుముందు జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ను మర్యాదపూర్వకంగా డిఎస్పి శ్రీనివాసరావు కలిశారు. అనంతరం అదనపు ఎస్పి ఎండి రియాజ్ హుల్ హక్ ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని వివిధ రకాల ఆయుధాలను వాటి పనితీరు పోలీస్ సిబ్బంది వద్ద ఉన్న అన్ని ఆయుధాల పరిస్థితి మెయింటనెన్స్ రికార్డులు తదితర అంశాలను పరిశీలించారు.