జిల్లా పోలీసు శాఖ బలోపేతానికి మరో అడుగు పడింది. మంగళగిరి పోలీసు హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రత్యేకంగా శిక్షణ పొందిన ‘హంటర్’ అనే నూతన జాగిలాన్ని కర్నూలు జిల్లా పోలీసులకు కేటాయించారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నూతన జాగిలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేలుడు పదార్థాలను గుర్తించడం, కేసుల ఛేదన, నేరస్థుల అన్వేషణలో హంటర్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.మంగళగిరి 6వ బెటాలియన్‌లో 10 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన హంటర్, బెల్జియం మలనాయిస్ జాతికి చెందినదని ఆయన వివరించారు. ఈ జాగిలం చేరికతో జిల్లా డాగ్ స్క్వాడ్‌లో జాగిలాల మొత్తం