బెజ్జూరు మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమిని గ్రామం తో పాటు 12 గిరిజన గ్రామాలకు రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ఏర్పడి అత్యవసర సమయాలలో కూడా అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి నెలకొందని వివిధ గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యంతోనే మా గ్రామాలకు ఈ పరిస్థితి నెలకొందని దశాబ్దాలు గడుస్తున్న తమ రోడ్డు పరిస్థితి మాత్రం మారడం లేదని పాలకులపై వివిధ గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు,