ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ళ గ్రామంలోని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పిలుపుమేరకు. తనికెళ్ళ గ్రామంలోని యాస అనంతరామయ్య నగర్ లో స్థానిక సమస్యలపై సర్వే నిర్వహిస్తున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు మెరుగు రమణ. తనికెళ్ల గ్రామ కార్యదర్శి యాస వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనికెళ్ళ గ్రామంలోని పలు నగరాల్లో ఎక్కడ చూసిన, మురుగునీరు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు పద్మని అన్నారపు వెంకటేశ్వర్లు. యాస అనంతరామయ్య తదితరులు పాల్గొన్నారు.