గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్ డేటా సైన్స్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మన్యం జిల్లా సాలూరు మండలం దేవ బుచమ్మపేట గ్రామానికి చెందిన గుంట్రెడ్డి మనోజ్ ఆదివారం మధ్యాహ్న సమయంలో యూనివర్సిటీ బాత్రూంలో ఉరి వేసుకోవడంతో తోటి విద్యార్థులు చూసి అంబులెన్స్ సహాయంతో పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అయితే వైద్యులు అప్పటికే మనోజ్ మరణించినట్లు గుర్తించారు.