నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో కే ఎల్ ఐ కాలువలో పడి వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై గోవర్ధన్ శనివారం తెలిపారు. శ్రీపురం గ్రామానికి చెందిన బుజ్జయ్య నాలుగు నెలలుగా మతిస్మితం కోల్పోయాడు. ఇతడు గత నెల 28న ఇంటి నుండి వెళ్లిపోయాడు అతడి కోసం ఇంత వెతికినా కుటుంబ సభ్యులకు ఆచూకీ లభించలేదు. శనివారం శ్రీపురం గ్రామంలోని కె ఎల్ఐ కాల్వ నుండి దుర్వాసన రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం బొజ్జయ్యదిగా గుర్తించారు.