తలమడుగు మండలంలోని కోడద్ గ్రామస్థులు గురువారం అంతర్ రాష్ట్ర రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వరద కారణంగా తమ ఇళ్లలోకి నీరు చేరుతోందని, కల్వర్టు లేకపోవడమే దీనికి కారణమని గ్రామస్థులు ఆరోపించారు. తలమడుగు ఎస్ఐ రాధిక అక్కడికి చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, కలెక్టర్ వచ్చే వరకు కదిలేది లేదని వారు తేల్చి చెప్పారు. ఈ నిరసన కారణంగా కిలోమీటరు మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి.