కొత్తూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. 18 కోట్లతో ప్రారంభమైన జేపీ దర్గా రహదారి విస్తరణ పనుల్లో జాప్యం పై ఆయన ఆరా తీశారు. మొదట్లో 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలని చూడగా ఎమ్మెల్యే జోక్యం చేసుకొని దానిని 60 అడుగులకు కుదించారు. అయినా పూలే చౌరస్తాలో విస్తరణకు పలు నిర్మాణాలు అడ్డంకిగా మారడంతో మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కమిషనర్ పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.