గుత్తి ప్రభుత్వాసుపత్రి సోమవారం రోగులతో కిటకిటలాడింది. జ్వరం, వాంతులు, వీరేచనాలతో రోగులు ఆసుపత్రిని ఆశ్రయించారు. దీంతో ఒక్కరోజే ఓపీ(అవుట్ పేషంట్) సంఖ్య అమాంతం పెరిగి 600కు చేరుకుందని ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ ఎల్లప్ప చెప్పారు. సాధారణంగా రోజూ 350 నుంచి 400 దాకా ఓపీ సంఖ్య ఉండేది. అయితే ఏకంగా 600కు చేరుకుంది. రోగులందరికీ వైద్యం అందించడం వైద్యులకు కష్టంగా మారింది.