పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో సెప్టెంబర్ 1న 35 వేల మందితో స్త్రీ శక్తి బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పిడుగురాళ్ల పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఆయన మధ్యాహ్న మూడు గంటల సమయంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు విజయం సాధించడానికి మొదటి అడుగు గురజాల నియోజకవర్గంలోని పొందుగల నుంచే మొదలైందని ఆయన పేర్కొన్నారు.