సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాల నారాయణఖేడ్ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంబడి దత్తు రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు అయిన నారాయణఖేడ్ లో మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన పాఠశాలను ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసిందన్నారు. వెనకబడిన ప్రాంతంలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రాంతం విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ పోరాటం చేస్తుందన్నారు.