షాద్నగర్లోని తన నివాసంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడాబాబులు బతకడానికి డబ్బులు సంపాదించుకుంటే చాలని అడ్డుగోలు సంపాదనలో పడి భవిష్యత్ తరాలను నాశనం చేయొద్దని కోరారు. భవిష్యత్ తరాలకు భూములు కొనడం ప్రతి భూమిని ఇంటి స్థలంగా మార్చితే పచ్చని నేలల్లో పంటలు ఎలా పండుతాయి అని ప్రశ్నించారు. భవిష్యత్ తరాలకు భూమి లేకుండా చేస్తున్న వారిపై మండిపడ్డారు.