24వ తేది సాయంత్రం 4గంటలకు గంగాధర మండలంలో జన హిత పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నారు. గురువారం సాయంత్రం 5గంటలకు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 24 వ తేదీన ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాదయాత్ర లో పాల్గొంటారని తెలిపారు.