శిరివెళ్లలో మనస్పర్థల కారణంగా కోటపాడుకు చెందిన జాంబుల నడిపి ఓబులేసుపై కత్తితో దాడి చేసిన అదే గ్రామానికి చెందిన రాగిపోగుల నారాయణకు కోర్టు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించించింది. ఈ మేరకు ఎస్ఐ పీరయ్య మంగళవారం వెల్లడించారు. 2019 జులై 21న హత్యాయత్నం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశామన్నారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారని తెలిపారు. ముద్దాయిని జైలుకు తరలించామన్నారు.