కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో మార్వాడి గో బ్యాక్ నినాదంతో బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ శ్యామ్ ను పోలీసులు అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ బంధు పిలుపు నేపథ్యంలో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.