కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఊహించలేని స్థితిలో కామారెడ్డిలో వర్షాలు కురిసాయన్నారు.. ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు పండగ రోజు ప్రజలంతా ఇండ్లలోనే ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదన్నారు. 30 మీటర్లు ఉన్న వాగు ప్రవాహం 300 మీటర్ల పారింది అన్నారు. ఒక చెరువు కెపాసిటీ 4 చెరువులను నింపేంత ఓవర్ ఫ్లో అయింది అన్నారు ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని అన్నారు.