కరీంనగర్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువతి అనారోగ్యంతో నగరంలోని దీపిక ఆసుపత్రిలో చికిత్స కోసం చేరింది. అర్ధరాత్రి ఆసుపత్రిలో పనిచేసే దక్షిణమూర్తి అనే కాంపాండర్ యువతికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి ఒడిగట్టినట్టు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో సీసీ టీవీ పుటేజ్ లను సేకరించారు. యువతికి చికిత్స అందించిన గదిని సీజ్ చేశారు. మహా రాష్ట్రకు చెందిన కాంపౌండర్ దక్షిణ మూర్తిని త్రిటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆసుపత్రి యాజమాన్యం దళిత సంఘాలను రంగంలోకి దింపినట్టు సమాచారం.