అనుమానాస్పద స్థితిలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున జరిగిందని ఎస్ఐ నాగన్న తెలిపారు.ఎస్సై కథనం ప్రకారం సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి దేవరకద్రలో గత కొన్ని రోజులుగా బిక్షాటన చేస్తూ ఉండేవాడని అయితే గురువారం తెల్లవారుజామున ఆర్ఓబి బ్రిడ్జి కింద అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. సుమారు అతని వయసు 60 సంవత్సరాలు ఉన్నదని ఇతని ఆచూకీ తెలిసినవారు ఉంటే 8712659349 నంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగన్న సాయంత్రం ఆరున్నర గంటలకు తెలిపారు.