వాల్మీపురం సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీఐ బి.రాఘవరెడ్డి ఆదివారం తెలిపారు. వాల్మీకిపురం సర్కిల్ పరిధిలోని వాల్మీకిపురం మరియు గుర్రంకొండ మండలాల్లో వినాయక చవితిని పురస్కరించుకుని ఐదవ రోజు అయిన ఆదివారం 20భారీ విగ్రహాలు నిమజ్జనం కొరకు ఏర్పాట్లను సిద్ధం చేశారు. ఇందులో భాగంగా జరుగుతున్న నిమజ్జన వేడుకలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బందితో సీఐ.బి రాఘవరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేసి సమీక్షించారు.