మంత్రాలయం:కోసిగి టీడీపీ నూతన మండల అధ్యక్షులుగా ఎన్నికైన రామిరెడ్డి ని మంత్రాలయం నియోజవర్గ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి తన కార్యాలయంలో శనివారం సన్మానించారు. పదవికి, ప్రజలకు వన్నె తెచ్చే విధంగా మండలంలో పాలన చేయాలని నూతన అధ్యక్షులకు తెలియజేశారు. ఆరుపదుల వయసులో మండల అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు, ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి కి, రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.