సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం పిట్లం మార్గంలో పత్తి విత్తనాలతో వెళ్తున్న ఓ లారీ ఆదివారం సాయంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు. ఎన్కమురి పత్తి మిల్లు నుంచి మహారాష్ట్రకు విత్తనాలను తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ బ్యాలెన్స్ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. రోడ్డుపై పడిన పత్తి విత్తనాల సంచులు చెల్లాచెదురుగా పడిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం కలిగింది.