నవసంధి వినాయకులకు పట్టు వస్త్రాల సమర్పణ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం తరఫున పురవీధులలో వెలసిన నవసంధి వినాయకులకు చవితి సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయ అలంకార మండపంలో పట్టు వస్త్రాలకు పూజలు చేశారు. అనంతరం వాటిని ఊరేగింపుగా తీసుకొచ్చి అర్చకులకు అందజేశారు. ఈవో బాపిరెడ్డి, బొజ్జల బృందమ్మ, చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.