చంద్రగ్రహణం సందర్భంగా కాల్వబుగ్గ దేవస్థానం మూసివేశారు. ఆదివారం ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ శ్రీబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేసినట్లు ఈవో మద్దిలేటి తెలిపారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. సోమవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.