రూరల్ నియోజకవర్గంలోని 18 గ్రామాలతోపాటు 1, 2,12, 31 డివిజన్లలో త్రీఫేస్ 24 గంటల కరెంటు సరఫరా పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికారులతో ఫోన్ ద్వారా ఆయన రివ్యూ నిర్వహించారు. త్రీ ఫేజ్ కోసం ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే పనులు పూర్తవుతాయన్నారు.