కాకినాడ, కచేరిపేట, శుక్రవారం, లక్ష్మిదాస్ భవన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంపు విధిస్తున్న 50% సుంకాల వల్ల కాకినాడ జిల్లా ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందని, తక్షణం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని ఆక్వా పరిశ్రమలు మూతపడకుండా, కార్మికుల తొలగింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిఐటియు కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ,