బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కాశీ పాలెంలోని మసీదు వద్ద శుక్రవారం మీలాదూన్ నబీ వేడుకలు ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన పురస్కరించుకొని బుచ్చిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త భక్తి గీతాలను ఆలపించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి అన్న ప్రసాద వితరణ చేశారు.