మల్దకల్ మండలంలోని బుధవారం సాయంత్రం మల్లెందొడ్డి గ్రామంలో దాదాపు 10 సం నుండి సమస్యలు తిష్ట వేశాయని ఓట్ల కోట్ల సమయంలో ఇండ్ల ముందర కొచ్చి ఓటు అడిగి అధికారాన్ని పొందుతున్నా, కష్టకాలంలో ప్రజల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యారని నడిగడ్డ హక్కుల పోరాట సమితి గ్రామ అధ్యక్షుడు సుదర్శన్ నాయుడు విమర్శించారు. చిత్తశుద్ధి లేని ప్రభుత్వం కేవలం ఓట్లు దండుకునే ప్రయత్నమే తప్ప సమస్యను పరిష్కరించే ప్రభుత్వం కాదని అధికారులు మొద్దు నిద్రను వీడి ఇలాంటి సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.