ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రిజర్వాయర్ ఆనకట్ట సమీపంలోని మిషన్ భగీరథ పథకం వద్ద కార్మికుల వేతనాలు చెల్లించాలని మిషన్ భగీరథ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు విధులు బహిష్కరించి సమ్మె చేపట్టారు మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలలు వేతనాలు చెల్లించాలని హెడ్ వర్క్ వద్ద నీటి సరఫరా బంద్ చేసి మిషన్ భగీరథ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు దీంతో 18 మండలాలకు త్రాగునీటి సరఫరా బంద్ అయింది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 600 మంది కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో త్రాగునీటి కోసం స్థానిక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు.