ప్రొద్దుటూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ 104వ మహాజనసభ శుక్రవారం సాయంత్రం బ్యాంకు ఆవరణంలో నిర్వహించారు. ఈ సమావేశంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పరిపాలన నివేదిక, లో చార్టర్డ్ అకౌంటెంట్ సమర్పించిన ఆడిట్ రిపోర్ట్‌ను సభ ఆమోదించింది. అలాగే జమా–ఖర్చులు, ఆస్తులు–అప్పులు, లాభనష్టాలపై సమగ్ర చర్చ జరిపి తీర్మానాలు ఆమోదించారు.ఆడిట్ నివేదిక ప్రకారం నికర లాభాన్ని బైలా నిబంధనలకు అనుగుణంగా కేటాయించి, సభ్యులకు డివిడెండ్ ప్రకటించారు. ఆమోదిత బడ్జెట్ అంచనాలకు మించి జరిగిన ఖర్చులను కూడా పరిశీలించి సభ ఆమోదం తెలిపింది. కొత్త సభ్యుల చేర్పు, అదనపు షేర్ల కేటాయింపు, సభ్యత్వం ఉపసంహరించ