మిలన్ వుద్ నబీ వేడుకలలో భాగంగా నిడదవోలులో శుక్రవారం భారీ ఊరేగింపు నిర్వహించారు. ఎన్టీఆర్ స్కూల్ వద్ద ఉన్న మదర్సా నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు గణపతి సెంటర్, సంత మార్కెట్ మీదుగా పలు ప్రాంతాల్లో తిరిగి చివరకు మదర్సా కు చేరుకుంది. అక్కడ జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులతో ప్రసంగించడం జరిగింది.