ఏలూరు జిల్లా జీలుగుమిల్లి పోలీసులు శనివారం సాయంత్రం ఒక కంటైనర్ను తనిఖీ చేయగా 12,100 కేజీల గోవు మాంసం లభ్యమైందని అధికారులు తెలిపారు. కలకత్తా నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆ కంటైనర్ ను గ్రామ శివారుల్లోని HP గ్యాస్ గోడౌన్ సమీపంలో వాహన తనిఖీల్లో అనుమానాస్పద కంటైనర్లో మాంసాన్ని గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. మాంసాన్ని నిర్జీవ ప్రదేశంలో పోలీసులు రెవెన్యూ అధికారులు ఖననం చేశారు.