ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం ఓ వివాహిత అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని నీలకంఠం వీధిలో నివాసముండే భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు. భార్య అలిగి తన తల్లి వద్ద గత 15 రోజుల నుంచి ఉంటుండగా వివాహిత మంగళవారం సాయంత్రం తినుబండారాలు తీసుకువస్తానని ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పి బయటికి వెళ్లి అదృశ్యమైంది. ఎంత వెతికిన వివాహిత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదుబాబు తెలిపారు.