Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 22, 2025
ఆటోడ్రైవర్లను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని అడ్డతీగల మండల ఆటో డ్రైవర్లు కోరారు. శుక్రవారం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. మహిళలే అధిక సంఖ్యలో ఆటోలలో ఎక్కేవారన్నారు. ప్రస్తుతం మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వలన వారు ఆటోలు ఎక్కడంలేదన్నారు.దీంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరారు.