గుత్తి మండలం తొండపాడు -కొత్తపేట గ్రామాల మధ్య ఉన్న ఐదు ఎకరాల పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మారణాయుధాలు, కట్టెలతో ఇరువర్గాలు తలపడ్డాయి. సమయానికి పోలీసులు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సమక్షంలోనే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చాలెంజ్ విసురుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే ఓ స్కార్పియో వాహనం డ్యామేజ్ అయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్నప్పటికీ బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.